నా రూపమే ఒక ప్రత్యేకమే – నీ సృష్టిలో నేను ఒక భాగమే
నా రూపమే నీవే ప్రతిరూపమే – దూతానికే లేని అపురూపమే
జగతికి పునాది నీవే – నీ ఊహల్లోన నేనే
తల్లి గర్భములోన – నన్ను నిర్మించినది నీవే ||2|| ||నా రూపమే||
1.కలతలు నిండిన లోగిలిలో – మమతలు వెల్లువ నింపావు
కరుణను మరిచిన నా హృదికి – కలువరి సిలువలో చూపావు ||2||
బాధల లోయలలోన – భారాల తీరాన
ప్రేమించినది నీవే – నను రక్షించినది నీవే ||2|| ||నా రూపమే||
2. తడబడు అడుగులు సరిచేసి – నిలబడు బలమును ఇచ్చావు
పదిలముగా నను పట్టుకొని – కదలని బండపై నిలిపావు ||2||
పరిశుద్ధతయు నీవే – నా ప్రాణ దీపం నీవే
నా పరవశమంతా నీవే – నా ప్రతికూలతలో నీవే||2|| ||నా రూపమే||