పల్లవి: వెలసెనులే గగనాన తూర్పు తారా నిశీధి రేయిజాములో – కురిసెనులే జగాన ప్రేమధార రక్షకుడేసు జన్మలో
క్రిస్మస్ కాంతులే లోకాన వెలిగెనే ప్రభూయేసే జన్మించగా – కన్యకు పుట్టెనేడు పరిశుద్ధుడే దీనులే ధన్యులాయెనే
శుభవార్త దూతదెల్పగా ఆ గొల్లలే గంతులేసేనే లోకాన రక్షణానందమే పరలోకానా సంగీతమాయెనే |2|
చరణం-1: తరించిపోయే ఆ తూర్పు జ్ఞానులు తీరాలు దాటి నిను చూడగా – బంగారు సాంబ్రాణి భోళములర్పించి నమస్కరించి పూజించిరి
రారాజే రక్షకుడై మనకోసం జన్మించెనని |శుభవార్త|
చరణం-2: జగాలనేలే జయశీలుడేసే జీవాదిపతిగా జనియించెనే – శరీరధారై పరిశుద్ధుడేసే పశుశాలలోన పవళించెనే
జయగీతం పాడి కీర్తించి కొనియాడెదము |శుభవార్త|
చరణం-3: మా పాపభారం భరియించెనే మా దుఃఖదోషం తొలగించునే – మన్నించి మమ్ము క్షమియించెనే కరుణించి మాపై కృపచూపెనే
మనసున్న మహారాజై మా మదిలో ఉదయించెనే |శుభవార్త|